పట్నా : బిహార్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సదకత్ ఆశ్రమ్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రారంభించిన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము సామాన్యుడి వెన్నంట నిలిస్తే బీజేపీ మాత్రం కేవలం ఇద్దరు ముగ్గురు అత్యంత సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తోందని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్దాన్, చత్తీస్ఘఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, బీజేపీ తమ దరిదాపుల్లోకి రాదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు బిహార్ సీఎం నితీష్ కుమార్ నివాసంలో విపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన నేతలు (యూబీటీ) ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ సహా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.
Read More :
Minister KTR | ఢిల్లీ చేరుకున్న మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ