న్యూఢిల్లీ : ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ప్రోత్సహించేందుకు నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్‌ను ప్రారంభించనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
వ్యాపార నిర్వహణ, వ్యయం, డిమాండ్‌కు తగ్గట్టుగా శ్రామికశక్తిని తయారుచేయడం, ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం, సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై ప్రధాన దృష్టితో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.