న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన వాళ్లలో చాలా వరకు ఇళ్లలోనే కోలుకుంటారు. కేవలం డాక్టర్‌తో టచ్‌లో ఉంటే చాలు. కంగారు పడి అటూ ఇటూ పరుగెత్తకండి. ఇది ఓ ఆరోగ్యమంత్రిగా కాదు డాక్టర్‌గా చెబుతున్నా అని అన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్. భయపడి హాస్పిటల్స్‌కు పరుగెత్తవద్దని ఆయన సూచించారు. నిజంగా ఆక్సిజన్ అవసరమైతే తీసుకోండి.. కానీ సరైన అవగాహ లేకుండా మాత్రం వద్దు అని హర్షవర్దన్ అన్నారు.
ఇక ఇప్పటి వరకూ రాష్ట్రాలకు 16 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని, అందులో 15 కోట్ల డోసులు ఇవ్వగా.. రాష్ట్రాల దగ్గర మరో కోటి డోసులు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో మరికొన్ని లక్షల వ్యాక్సిన్ డోసులు కూడా పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచీ ఒక్క రోజు కూడా రాష్ట్రాలు వాళ్ల సామర్థ్యం కంటే తక్కువ వ్యాక్సిన్లు ఇవ్వలేదని హర్షవర్దన్ తేల్చి చెప్పారు.
ఇక ఆక్సిజన్ కొరతపైనా ఆయన స్పందించారు. గతంలోనూ ఆక్సిజన్ అవసరమైన మేర అందుబాటులో ఉన్నదని, ఇప్పుడు వివిధ వనరుల నుంచి ఆక్సిజన్ సేకరిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, విదేశాల నుంచి సేకరించి, స్టోరేజ్ ట్యాంకర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఆక్సిజన్ గురించి సరైన సమాచారం అందుబాటులో ఉంచేలా చూడాలని కూడా ఆయన కోరారు.
That means over 1 crore doses are still left with states. Some lakh doses are in pipeline & will be delivered in next 2-3 days. Since beginning of vaccination, not a single day has passed when states were not given vaccine doses as per their capacity: Union Health Minister (2/2) pic.twitter.com/zEXczapUCd
— ANI (@ANI) April 29, 2021