ముంబై : కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం సోమవారం ఉదయం 9.27 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై జారిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ప్రైమరీ రన్‌వే స్వల్పంగా దెబ్బతింది.
ఈ విమానంలోని ఒక చక్రం గడ్డి ఉన్న ప్రదేశం నుంచి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఇంజిన్ దెబ్బతింది. ఈ సంఘటనలో మూడు సైనేజ్ బోర్డులు, నాలుగు ఎడ్జ్ లైట్స్ దెబ్బతిన్నాయి. ఇద్దరు పైలట్లను డీరోస్టర్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ రన్‌వే కూడా వర్షపు నీటి వల్ల తడిసిపోయింది.