న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కశ్మీర్ గేట్‌కు సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, ఇప్పటివరకు ఎనిమిది మందిని రక్షించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లను తరలించి.. సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు నికల్సన్ రోడ్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే ఆరు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్, డీడీఎంఏ బృందాలు అగ్నిమాపక బృందాలు చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. మరికొందరు ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కుప్పకూలిన భవనం గురు చరణ్ సింగ్ అనే బిల్డర్‌కు చెందిందని అధికారులు పేర్కొన్నారు.