న్యూఢిల్లీ: డీఆర్డీవో నిర్వహించిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ ‘పినాక’ తొలి టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ అయ్యింది. సోమవారం చాందీపూర్‌లో 120 కిలోమీటర్ల గరిష్ఠ రేంజ్లో రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. ప్రణాళిక ప్రకారం విన్యాసాలను అమలుచేసిందని, కచ్చితత్వంతో టార్గెట్‌ను కూల్చిందని అధికారులు తెలిపారు.
‘పినాక’ విజయంపై డీఆర్డీవో సైంటిస్టులను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. మార్గనిర్దేశక వ్యవస్థ లేని రాకెట్లకు బదులుగా, నావిగేషన్‌తో కచ్చితమైన దాడుల కోసం ‘పినాక’ రాకెట్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది.