న్యూఢిల్లీ: తనను లోక్సభ నుంచి బహిష్కరించడంపై తృణమూల్ నేత మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8న లోక్సభలో వాడీవేడి చర్చ అనంతరం ఆమెను స్పీకర్ సభ నుంచి బహిష్కరించారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడగటానికి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ సిఫారసు మేరకు మహువాను బహిష్కరించారు.