Mahesh Jirawala | అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సినీ నిర్మాత మహేశ్ జిరావాలా (34) మరణించారు. ఈ ఘటన తర్వాత ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా ఆయన ప్రమాదంలో చనిపోయినట్లు ధ్రువీకరించారు. మహేశ్ జిరావాలా ద్విచక్ర వాహనం ఆ ప్రాంతం గుండగా వెళ్తుండగా.. లండన్‌కు బయలుదేరిన విమానం అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ హాస్టల్ భవనంపై కూలిపోయిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. మహేశ్ మృతదేహాన్ని కుటుంబానికి అందజేసినట్లు పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్షల్లో జిరావాలా విమాన ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారణ అయ్యిందని.. అయితే, ఆయన కుటుంబం మాత్రం ఆయన మృతిని నమ్మలేకపోయిందని తెలిపారు. సంఘటనా స్థలంలో పోలీసులు కాలిపోయిన స్కూటర్, సీసీటీవీ ఫుటేజీ తదితర ఆధారాలను సేకరించారని సెక్టార్- జాయింట్ సీపీ జైపాల్ సింగ్ రాథోడ్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించామన్నారు. విమాన ప్రమాదం జరిగిన సమయం మంటల్లో ధ్వంసమైన స్కూటర్‌ను సంఘటనా స్థలంలోనే స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఛాసిస్, ఇంజిన్ నంబర్లు సైతం స్కూటర్ రిజిస్ట్రేషన్ పత్రాలతో సరిపోలాయని.. సీసీటీవీ ఫుటేజీతో సహా అన్ని ఆధారాలను నిర్ధారించుకున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులను సందేహాలను నివృత్తి చేసేందుకు.. ఆయన గతకొంతకాలంగా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాడనేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించామన్నారు. అలాగే, నిర్మాత చివరి మొబైల్ లొకేషన్ సైతం ప్రమాద స్థలానికి సమీపంలోనే గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మహేశ్ జిరావాలా నిర్మాతగా వ్యవహరిస్తూనే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌కు దర్శకత్వం వహించారు. ప్రమాదం జరిగిన రోజును లా గార్డెన్ సమయంలో ఒకరిని కలిసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం 1.14 గంటల ప్రాంతంలో మహేశ్‌కు భార్య పోన్ చేయగా.. తన పని ముగిసిందని.. ఇంటికే వస్తున్నానని చెప్పారు. అయితే, తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన నెంబర్‌కు తిరిగి భార్య కాల్ చేసింది. కానీ, సిచ్ఛాప్ వచ్చింది. పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన రోజున చివరి మొబైల్ లొకేషన్ సంఘటనా స్థలానికి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, తన భర్త విమాన ప్రమాదంలో చనిపోయాడని నమ్మడం లేదని హేత్ తెలిపారు. ఆయన ఇంటికి వచ్చేందుకు ఎప్పుడూ ఆ మార్గంలో రాలేదని పేర్కొన్నారు.