ముంబై: మహాత్మా గాంధీ మనుమడు, సామాజిక కార్యకర్త అరుణ్ మణిలాల్ గాంధీ(89) మంగళ వారం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మరణించారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అవనీ స్వచ్ఛంద సంస్థతో ఆయన గత మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నారు.
30 ఏండ్ల పాటు జర్నలిస్టుగా పని చేశారు. 1991లో అమెరికాలోనిక్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీలోఎంకే గాంధీ అహింసా సంస్థను స్థాపించారు.