ముంబై: ఒక మహిళ తన భర్త, సోదరుడు, మరొకరితో కలిసి ప్రియుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్‌లో కుక్కి కాలువలో పడేశారు. ఆ వ్యక్తి మిస్సింగ్ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. (Woman Kills Lover) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముంబ్రాకు చెందిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్, ఏప్రిల్ 3న పని నిమిత్తం దాదర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఫలితం లేకపోవంతో అర్బాజ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్బాజ్ ఫోన్ కాల్స్, లొకేషన్ డేటాను పరిశీలించారు. చివరిసారి వసాయి ప్రాంతంలో అతడు ఉన్నట్లు తెలుసుకున్నారు. అర్బాజ్ ప్రియురాలు మెహజబీన్ షేక్ ఫోన్ లొకేషన్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెపై అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు తొలుత బుకాయించిన మెహజబీన్, ఆ తర్వాత నిజాన్ని అంగీకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అర్బాజ్ నుంచి డబ్బు వసూలు కోసం ప్రయత్నించారని, ఫలితం లేకపోవడంతో అతడ్ని హత్య చేసినట్లు చెప్పారు. మెహజబీన్, ఆమె భర్త హసన్, సోదరుడు తారిక్ షేక్, అతడి ఫ్రెండ్ కలిసి అర్బాజ్‌ను కట్టేసి కొట్టారని, ఆ తర్వాత అతడ్ని హత్య చేశారని వెల్లడించారు.
అనంతరం నిందితులు అర్బాజ్ మృతదేహాన్ని గ్రీన్ డ్రమ్‌లో కుక్కి ముంబ్రా ప్రాంతంలోని కాలువలో పాడేశారని పోలీస్ అధికారి తెలిపారు. మెహజబీన్ సమాచారంతో గ్రీన్ డ్రమ్‌లో కుక్కిన అర్బాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మెహజబీన్, ఆమె భర్త హసన్, సోదరుడు తారిక్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. హత్యతో పాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి బ్లూ డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో నింపిన సంఘటనను ఇది గుర్తు చేసింది.
Also Read:
Congress Leader Dies Of Snakebite | ఉప ఎన్నిక పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత.. పాము కాటుతో మృతి
Groom Beaten Up | పెళ్లిలో వరుడ్ని గుర్తించని వధువు.. అతడ్ని కొట్టడంతో ఆసుపత్రిపాలు
Watch: బలమైన గాలులకు, గాల్లోకి ఎగిరిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?