పుణె: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై దేశ వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో తమకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే కావాలంటూ మరో గ్రామం డిమాండ్ చేసింది. ఇక ముందు గ్రామంలో జరిగే ఏ ఎన్నిక అయినా బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర సతార జిల్లాలోని కొలేవాడి గ్రామ సభ తీర్మానించింది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ 2న ఈ తీర్మానం చేసినట్టు సర్పంచ్ భర్త మంగళవారం తెలిపారు.
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అనూహ్య పరాజయం పొందిన ఇండియా కూటమి.. ఈవీఎంల రిగ్గింగే తమ ఓటమికి ప్రధాన కారణమని భావిస్తున్నది. ఈవీఎంల్లో అనేక అవతవకలు జరిగినట్టు కూటమి ఆరోపించింది. అయితే దీనిని ఈసీ తిరస్కరించింది. దానితో సంతృప్తి చెందని కూటమి నేతలు ఈవీఎంల అవకతవకలపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. శుక్రవారం లోగా దీనిపై పిటిషన్ను వేస్తారని కూటమి నేతలు తెలిపారు.