ముంబై, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సంత్ తుకడోజీ మహారాజ్ 57వ జయంతి సందర్భంగా రాష్ర్ట్సంత్ తుకడోజీ మహరాజ్ నాగ్పూర్ విశ్వవిద్యాలయం ‘యా భారత్ బంధుభావ్’ అనే గీతాన్ని 52 వేల మందితో ఆలపించి గిన్నిస్ రికార్డ్ సాధించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడరీ, రాష్ట్ర మంత్రులు డాక్టర్ పంకజ్ భోయార్, ఆశిష్ జైస్వాల్ తదితరులు హాజరయ్యారు.
ఈ గీతాలాపనలో 16 వేల మంది ప్రత్యక్షంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పాల్గొనగా, మరో 52 వేల మందికి పైగా ఆన్లైన్ ద్వారా ఈ గానంలో భాగమయ్యారు. ఒకేసారి ఇంతమంది ఒక విశ్వవిద్యాలయ గీతాన్ని ఆలపించడం అత్యంత పెద్ద ఆన్లైన్ వీడియో ఆల్బమ్ కేటగిరీలో ప్రపంచ రికార్డుగా నమోదైంది.