న్యూఢిల్లీ : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఇంకెంత కాలం సాగదీస్తారని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని స్పీకర్ గౌరవించాలని, అనర్హత పిటిషన్ల విచారణకు స్పీకర్ పెట్టుకున్న కాలపరిమితిని వారం రోజుల్లోగా తమకు తెలియజేయాలని మహారాష్ట్ర స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తేల్చి చెప్పింది.