Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం శివసేన ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆధిత్య ఠాక్రే తనయుడు, మాజీ మంత్రి ఆదిత్య థాకరే వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మహిమ్ నుంచి మహేశ్ సావంత్, థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజన్ విచారేను బరిలోకి దింపనున్నట్లు ఉద్ధవ్ వర్గం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కేదార్ పోటీ చేయనున్నారు. షిండే కోప్రి-పచ్పఖాడి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి బరిలోకి దిగుతుండగా.. ఆయనపై కేదార్ దిఘేను ఆయనపై బరిలోకి దింపబోతున్నది.
288 నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్లో ఒకే విడుదలో ఎన్నికల జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని ఎన్సీపీ (అజిత్ పవర్), శివసేన (ఏక్నాథ్ షిండే) పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన (ఉద్ధవ్) అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. మూడు పార్టీలు 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం 270 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కూటమి నేతలు తెలిపారు. మిగతా 18 సీట్లపై సమాజ్వాదీ పార్టీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని ఎంవీఏ కూటమి పేర్కొంది. ఈ క్రమంలోనే శివసేన (ఉద్ధవ్ థాకరే) 65 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.