సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 22:22:50

6,738 కరోనా కేసులు.. 91 మరణాలు

6,738 కరోనా కేసులు.. 91 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌వ్యాప్తి కాస్త తగ్గింది. ఇటీవల తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 6,738 పాజిటివ్‌ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,60,766కు, మరణాల సంఖ్య 43,554కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 8,430 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,86,926కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,29,746 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.