రెబల్స్‌పై రగిలిపోతున్న శివసైనికులు… మహారాష్ట్ర పోలీసులు హై అలెర్ట్
ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివ సైనికులు రగిలిపోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం అనంతరం శివసేన కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. వారి కటౌట్లు, పోస్టర్లను చించివేస్తున్నారు.
తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ను శివసేన కార్యకర్తలు శుక్రవారం ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ నిలువరించలేకపోయారు. అలాగే శుక్రవారం రెబల్ గ్రూప్‌లో చేరిన ఎమ్మెల్యే దిలీప్ లాండేకు చెందిన కటౌన్‌ను ధ్వంసం చేశారు.
మరోవైపు శివసైనికుల ఆగ్రహావేశాల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా ముంబైలోని అన్ని పోలీసు స్టేషన్లు హై అలర్ట్‌గా ఉండాలని వారికి ఆదేశాలు అందాయి. శివసైనికులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగే అవకాశమున్నదని పోలీసులకు సమాచారం అందింది. దీంతో శాంతి భద్రతలు నెలకొనేలా చూసేందుకు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.
#WATCH | Maharashtra | Office of rebel MLA Mangesh Kudalkar in Kurla vandalised allegedly by Shiv Sena workers today pic.twitter.com/RhVYGJVw5X
— ANI (@ANI) June 24, 2022
Maharashtra | Poster of Shiv Sena MLA Dilip Lande, who is currently camping in Guwahati with rebel party leader Eknath Shinde, smeared with ink and a poster showing his picture torn in Mumbai pic.twitter.com/XXmfCacBAc
— ANI (@ANI) June 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

