Maharashtra | ముంబై, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని బుల్దానాలో నిరుడు డిసెంబర్లో ఓ వింత వ్యాధి వ్యాపించి అకస్మాత్తుగా ప్రజల్లో జుట్టు రాలడం మొదలై పిల్లలు, పెద్దలు స్త్రీలలో చూస్తుండగానే బట్టతల ఏర్పడింది. రెండు నెలల్లోనే 18 గ్రామాల్లో 279 మందికి జుట్టు ఊడిపోయింది. ఈ కేసుకు సంబంధించిన వైద్య నివేదిక మంగళవారం వెలువడింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం, పంజాబ్, హర్యానాల నుంచి వచ్చిన గోధుమలే ప్రజల జుట్టు రాలడానికి కారణమని తెలిసింది. ఈ గోధుమలలో సెలీనియం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇకడి ప్రజలు వాడిన గోధుమలు పంజాబ్, హర్యానా నుంచి వచ్చాయని, ఇవి మహారాష్ట్రలోని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అయ్యాయని తేలింది. మహారాష్ట్రలో స్థానికంగా పండించిన గోధుమల కంటే పంజాబ్,హర్యానా గోధుమలలో 600 రెట్లు ఎకువ సెలీనియం ఉందని పరిశోధనలో తేలిందని నివేదిక పేర్కొంది.