ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అనుచరుడు ఛగన్ భుజ్‌బల్ (Chhagan Bhujbal) ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్‌ను సోమవారం కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన భుజ్‌బల్ మరాఠా కోటా, ఓబీసీ నిరసనలపై చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని శరద్ పవార్‌ను కోరారు. అనంతరం మంత్రి ఛగన్ భుజ్‌బల్ మీడియాతో మాట్లాడారు. శరద్ పవార్‌తో దాదాపు గంటన్నర సేపు సమావేశమైనట్లు తెలిపారు. మరాఠా కోటా, ఓబీసీ నిరసనల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయన్నారు.
కాగా, శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఓబీసీల సమస్యలను పరిష్కరించారని ఛగన్ భుజ్‌బల్ తెలిపారు. అందుకే ఇప్పుడు ఆయన జోక్యాన్ని కోరినట్లు చెప్పారు. సీఎం ఏక్నాథ్ షిండే, రాష్ట్రంలోని ఇతర ముఖ్య నేతలతో చర్చించడానికి ఆయన అంగీకరించారని అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కోలుకోవడానికి రెండు రోజులు అవసరమని చెప్పారన్నారు. అలాగే శరద్ పవార్ విశ్రాంతి తీసుకోవడంతో ఆయనను కలిసేందుకు సుమారు గంటన్నర వేచి ఉన్నానని అన్నారు.
మరోవైపు శరద్ పవార్‌ను ఛగన్ భుజ్‌బల్ కలవడం ఎన్సీపీలో చర్చకు దారి తీసింది. సీనియర్ నేత అయిన ఆయన అజిత్ పవార్ ఎన్సీపీలో ఇమడలేకపోతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తిరిగి శరద్ పవార్ వర్గంలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
#WATCH | Mumbai: On meeting with NCP-SCP Chief Sharad Pawar, Maharashtra Minister Chhagan Bhujbal says, "… NCP-SCP Chief Sharad Pawar knows how the people of different communities are living in villages. I told him that there are clashes in villages in connection with the… pic.twitter.com/mmNr5ghRTA
— ANI (@ANI) July 15, 2024