ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నానని, శనివారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నది గుర్తించాలని కోరారు. కరోనా నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్వీట్ చేశారు.
On having mild symptoms of COVID, I had myself tested and I am COVID positive. I request everyone who came in contact with me to get themselves tested.
— Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021
I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe