ముంబై: గ్లూ వ్యసనానికి బానిసైన వ్యక్తి డబ్బుల కోసం కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో కత్తితో వారిపై దాడి చేశాడు. నానమ్మ మరణించగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. (Glue Addiction) మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ఈ సంఘటన జరిగింది. జిగురు పదార్థాలు, పెయింట్ థిన్నర్లలో ఉండే టౌలీన్ అనే విష రసాయనం మత్తు కలిగిస్తుంది. ఈ రసాయం వల్ల వల్ల వినికిడి లోపంతో పాటు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. నాడీ సంబంధిత రుగ్మతలు కలుగుతాయి.
కాగా, పర్లి నగరానికి చెందిన అర్బాజ్ రంజాన్ ఖురేషి ఈ కెమికల్ గ్లూకు బానిసయ్యాడు. ఆ మత్తులో ఉన్న అతడు తన కుటుంబ సభ్యులను డబ్బులు అడిగాడు. వారు నిరాకరించడంతో కత్తితో పొడిచాడు. దీంతో నానమ్మ జుబేదా అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన అతడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్బాజ్ రంజాన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Woman Calls Lover Home Kills | ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి హత్య చేసిన మహిళ
Watch: విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్
BJP Expels Spokesperson | బీజేపీపై బహిరంగ విమర్శలు.. అధికార ప్రతినిధి బహిష్కరణ