ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు 50 శాతం మేర పెరిగింది. శుక్రవారం మరో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 454కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగా 8,067 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే కొత్తగా 5,428 కరోనా కేసులు రికార్డయ్యాయి. గురువారం 3,671 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో అదనంగా 1,757 కేసులు చేరాయి. దీంతో ముంబైలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 66,78,821కి పెరిగింది. మరోవైపు మహారాష్ట్రలో ఎనిమిది మంది కరోనా రోగులు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,41,526కు చేరింది.