ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించింది. (Cow As ‘Rajya Mata’) ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేద కాలం నుంచి దేశీయ గోవుల ప్రాముఖ్యత, వాటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రికంగా ఆవు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. మానవ పోషణలో దేశవాళీ ఆవు పాల ప్రాముఖ్యత, ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువు ఉపయోగం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వ్యవసాయ, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్యశాఖ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మంత్రివర్గం కూడా సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశీయ ఆవుల పెంపకం కోసం రోజుకు రూ.50 మంజూరు చేసే సబ్సిడీ పథకానికి ఆమోదం తెలిపింది.
మరోవైపు నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హిందువులను ఆకట్టుకునేందుకు ఆవును ‘రాజ్యమాత’గా పేర్కొంటూ షిండే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి.
Cow is ‘Rajya Mata’ in Maharashtra now.
CM @mieknathshinde led Sarkar issues notification .
Maharashtra govt declares cow as ‘Rajya Mata’ ahead of polls, cites its cultural importance@CNNnews18
महाराष्ट्र सरकार का बडा निर्णय.शिंदे सरकार ने गाय को दिया *राज्यमाता- गोमाता*… pic.twitter.com/vuDhykphzy
— Anand Narasimhan🇮🇳 (@AnchorAnandN) September 30, 2024
A decision was taken in the Maharashtra cabinet meeting today to implement a subsidy scheme of Rs 50 per day for rearing of indigenous cows. Chief Minister Eknath Shinde presided over the meeting. Since the Goshalas could not afford it due to their low income, the decision was…
— ANI (@ANI) September 30, 2024