‘పరాభవ’ ఓ నిజం
అనంత సంగ్రామాల జీవితం! అలుపెరుగని గమనాల బ్రతుకు చిత్రం
అనంత సంగ్రామాల జీవితం!
అలుపెరుగని గమనాల బ్రతుకు చిత్రం!!
ఈ నిశ్చల జగత్తులో చలనం లేని
హృదయాల మహాప్రళయాల పరిధిలో
అపరిమిత కలల్ని కంటూ
పరిమితమైన పనులు చేస్తూ
ఆనంద చిహ్నాల వేటలో
మనుషులు మరుగుజ్జు బుద్ధులకు
మార్మిక ప్రతీకలవుతున్నారు
నమ్మిన సిద్ధాంతాలు, ఆచరించిన ఆదర్శాలు
దైవత్వ భావమనుకుంటే
నిత్యం నీ వెంటే చరించే
నీలోనే చిగురించే మంచితనమూ మానవత్వాలు
దేవతా విగ్రహాలవుతాయి
ఆరు రుచుల ఆహారంతోపాటు నీవు
భవిత సాధనగానో సమర్పణ భావంగానో
గృహావసర సంపాదనగానో మితవ్యయంగానో
సంసారపక్షిగానో నిజాయితీ వ్యక్తిగానో ఉన్నావంటే
నడిచే దేవాలయమనే శరీరంలోని
నీ హృదయమే నీదైన చైతన్య గర్భగుడి
‘పర’ అనే పార్వతి ‘భవ’ అనే హరుడూ
సిరి హరి రూపమూ అయ్యి..
శక్తివీ యుక్తివీ నీవవుతావు!
‘పరాభవ’ అపరతత్త్వాన్ని నీది చేసుకున్నావో..
జగమంతా నీ కుటుంబం కాకున్నా …
నీదైన కుటుంబం నీదవుతుంది
లివింగ్ టుగెదర్ బడబాగ్నులూ
కోలివింగ్ కష్టాలు చూస్తున్నవాళ్లుగా మీరంతా
పచ్చని చెట్ల వంటి రేపటి తరాలను కోరేవాళ్లే
బతుకు మాపటి పొద్దైపోయేదీ తెలిసిన వాళ్లేనని
హేమంత శిశిరాలు దాటొచ్చినట్టు చైత్ర వసంతాలను
కోరుకుంటారని ఈ కొత్త సంవత్సరానికి తెలుసు!
క్రోధ విశ్వావసులిచ్చిన మంచిచెడులను మరువక
పరంపరాగత వాగర్థాలలా ప్రస్తుతంలో బ్రతుకు
అనంత సంగ్రామ ప్రళయాల నడకేకాదు
మాట భావాల సంతులిత సంగమంగా
పరాభవ తత్త్వమంతా వంటబట్టించుకుంటే
అపరిమిత బ్రతుకు ప్రణయాలూ మీవవుతాయి
-డాక్టర్ కొండపల్లి
నీహారిణి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

