Governor Bhagat Singh Koshyari | నన్ను గవర్నర్ పదవి నుంచి తప్పించండి అని ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అభ్యర్థించారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. మిగిలిన జీవితాన్ని చదవడానికి, రాయడానికి, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుకుంటున్నానని గవర్నర్ కోశ్యారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి నేను సేవలందించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. సాధువులు, సంఘ సంస్కర్తలు, వీర యోధులు నడియాడిన నేల ఇది అని గవర్నర్ పేర్కొన్నారు.
ఇటీవల మోదీ మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో తన కోరికను ఆయనకు చెప్పానని కోశ్యారి తెలిపారు. పదవి నుంచి తప్పించాలని కోరుకున్నట్లు మోదీకి తెలియజేసినట్లు కోశ్యారి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నుంచి తాను ఎల్లప్పుడూ ప్రేమ, ఆప్యాయతలు పొందుతున్నాను. ఆ మాదిరిగానే మోదీ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
I have always received the love and affection from the Hon’ble Prime Minister and I hope to receive the same in this regard.
— Governor of Maharashtra (@maha_governor) January 23, 2023