ముంబై: ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని పదవి నుంచి తొలగించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
శివాజీ పాత ఐకాన్ అన్న గవర్నర్‌పైనా.. ఔరంగజేబును శివాజీ క్షమాపణలు కోరారన్న బీజేపీ నేత సుధాన్షు త్రివేదిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషన్లో కోరారు. దీపక్ దిలీప్ జాదవ్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఇప్పటికే మహారాష్ట్రలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.