బలాన్ని నిరూపించుకోండి.. ఉద్దవ్‌కు గవర్నర్ డెడ్‌లైన్
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ చివరి దశకు చేరుకున్నది. రేపు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ భగవత్ సింగ్ కోశియారి ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటల లోపు సీఎం ఉద్దవ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బలపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. అయితే ఆ అసెంబ్లీ సమావేశాల్ని రికార్డ్ చేయాలని కూడా గవర్నర్ కోశియారి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. శివసేన పార్టీలో వచ్చిన చీలికలతో మహా వికాశ్ అగాధీ కూటమి ఇబ్బందుల్లో పడింది. షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు కొందరు సీఎం ఉద్దవ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు దిగారు. దీంతో మహారాష్ట్ర సర్కార్ అగాధంలోకి కూరుకుపోయింది. తనతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏక్నాథ్ షిండే తెలిపారు.
గురువారం ఉదయం 11 గంటలకు సభ సమావేశం అవుతుందని, ఒకే ఎజెండాతో సభ జరుగుతుందని గవర్నర్ కోశియారి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, సుమారు 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాశ్ అగాధి ప్రభుత్వాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని, దీనికి మద్దతు ఇస్తూ ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా లేఖలు రాసినట్లు గవర్నర్ తెలిపారు. ప్రతిపక్ష నేత కూడా తనను కలిసి పరిస్థితిని వివరించినట్లు గవర్నర్ చెప్పారు. దానికి అనుగుణంగా బలపరీక్ష జరగాలని గవర్నర్ ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

