ముంబై: తన కూతురు స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అడిగినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, అతడి భార్య దాడి చేసిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని పూర్ణలో గురువారం చోటుచేసుకుంది.
రైతు జగన్నాథ్ హెగ్డె (42) కూతురు ఓ రెసిడెన్షియల్లో స్కూల్లో చదువుతోంది. తన కూతురి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) కోసం అతడు సదరు పాఠశాలకు వెళ్లాడు. అయితే పెండింగ్ ఫీజు బకాయి చెల్లించాలని పాఠశాల పరిపాలన అధికారి, అతడి భార్య జగన్నాథ్ హెగ్డెతో తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో వారు దాడి చేయడంతో జగన్నాథ్ హెగ్డె అక్కడికక్కడే మృతి చెందాడు.