CM KCR | కృష్ణా, గోదావరి మహారాష్ట్రలోనే పుట్టాయి.. కానీ సాగు, తాగునీటికి ఇబ్బందులే : సీఎం కేసీఆర్
CM KCR | కృష్ణా( Krishna ), గోదావరి( Godavari ) నదులు మహారాష్ట్రలోనే పుట్టాయి.. కానీ మహారాష్ట్రలో సాగు, తాగునీరు అన్ని చోట్లకు అందుబాటులో లేదు అని బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తెలిపారు. మహారాష్ట్ర( Maharashtra )లో సంపదకు కొదువ లేదు.. ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేదు అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
CM KCR | నాందేడ్ : మహారాష్ట్ర( Maharashtra )లో సంపదకు కొదువ లేదు.. ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేదు అని బీఆర్ఎస్( BRS ) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ధ్వజమెత్తారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ( Telangana ) మహారాష్ట్ర కంటే దారుణంగా ఉండేది. తెలంగాణలో సాధ్యమైంది.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు. ఈ 9 ఏండ్ల కాలంలోనే దేశానికే ఆదర్శంగా తెలంగాణను అభివృద్ధి చేశాం అని కేసీఆర్ పేర్కొన్నారు. నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహా( Kandhar Loha )లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభ( BRS Party Public Meeting )లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కృష్ణా( Krishna ), గోదావరి( Godavari ) నదులు మహారాష్ట్రలోనే పుట్టాయి.. కానీ మహారాష్ట్రలో సాగు, తాగునీరు అన్ని చోట్లకు అందుబాటులో లేదు అని కేసీఆర్ తెలిపారు. అవసరానికి మించి నీళ్లున్నా సాగుకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. మన కండ్ల ముందే ఏటా 50 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తాం. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి. 125 ఏండ్లు కరెంట్ ఇచ్చేంత బొగ్గు మన దేశంలో ఉంది. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటల విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చు అని కేసీఆర్ చెప్పారు.
కొందరు నాయకులు మైకులు పగిలేలా ఉపన్యాసాలు ఇస్తారు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మనం కండ్లు తిరిగి పడిపోవాల్సిందే అని కేసీఆర్ విమర్శించారు. మీరు గెలిపించి పంపిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ నిద్రపోతున్నారు. రైతులు, కూలీలు, దళితులు ఎవరినీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మీ నుంచే నాయకుడిని ఎన్నుకుంటే మార్పు వస్తుంది. రైతులు ఐక్యంగా పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుంది. నేను ఒక్కసారి నాందేడ్ వచ్చి వెళ్తే మహారాష్ట్రలో రైతులకు బడ్జెట్లో నిధులు పెంచారు. మహారాష్ట్రలో రైతుబంధు పథకం అమలు చేసే వరకు కొట్లాడుతాం. వరి, గోధుమలు, చెరుకు పంటలకు మద్దతు ధర కోసం ప్రతి ఏడాది కొట్లాడాల్సిందేనా..? మహారాష్ట్రలో రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

