ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అధిక సీట్లు సాధించడంపై మహారాష్ట్ర కాంగ్రెస్‌లో సంబరాలు మిన్నంటాయి. పార్టీ కార్యాలయంలో గురువారం విజయోత్సవాన్ని జరుపుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేకు (Nana Patole) 96 కేజీల లడ్డూలతో తులాభారం నిర్వహించారు. ‘విజయీభవా’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మహారాష్ట్రలోని 48 సీట్లకుగాను ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి లోక్‌సభ ఎన్నికల్లో 30 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 13 సీట్లు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎనిమిది సీట్లు గెలుచుకుంది.
మరోవైపు 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి.
కాగా, ఈ ఏడాది చివర్లో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేసి గెలుస్తామని నానా పటోలే తెలిపారు. లోక్‌సభ ఎన్నికల పనితీరును మళ్లీ ప్రదర్శిస్తామని ఎక్స్‌లో పేర్కొన్నారు.
📽️ Watch | Maharashtra Congress chief Nana Patole weighed with 96 kg laddoos.
This comes after Congress’ big win with 13 out of 48 Lok Sabha seats in the state. pic.twitter.com/RwyUxf0YHJ
— NDTV (@ndtv) June 6, 2024