Eknath Shinde : మహారాష్ట్ర ముఖ్యమంత్రి, షిండే వర్గం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే (Eknath Shinde) కోప్రీ-పచ్పఖడీ (Kopri-Pachpakhadi) అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, కుటుంబసభ్యులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన ఆయన.. అక్కడ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
#WATCH | Maharashtra CM and Shiv Sena chief Eknath Shinde files his nomination today from Kopri-Pachpakhadi Assembly constituency, for #MaharashtraElection2024.
(Source: DGPR) pic.twitter.com/xRUGcnrsgw
— ANI (@ANI) October 28, 2024
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీలు తమకు కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వీరికి తోడు పలువురు స్వతంత్రులుగా కూడా పోటీ చేస్తున్నారు.
కాగా మహారాష్ట్రలో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. బీజేపీ, షిండే వర్గం శివసేన, అజిత్‌పవార్ వర్గం ఎన్సీపీ మహాయుతి కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన, కాంగ్రెస్, శరద్‌పవార్ వర్గం ఎన్సీపీ మహా వికాస్ అఘాడీ కూటమిలో ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి.