గురువారం 28 జనవరి 2021
National - Jan 11, 2021 , 09:55:05

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ..8 వందల కోళ్లు మృతి

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ..8 వందల కోళ్లు మృతి

ముంబై: దేశంలో బర్డఫ్లూ కలకలం రేపుతున్నది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో మాయదారి రోగంతో కోళ్లు, పక్షులు చనిపోతున్నాయి. తాజాగా ఈ రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర చేరింది. రాష్ట్రంలోని పర్బణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో గత రెండు రోజుల్లో సుమారు 800 కోళ్లు మృతిచెందాయి. దీంతో కోళ్ల నమూనాలను ల్యాబ్‌కు పంపించామని జిల్లా కలెక్టర్‌ దీపక్‌ మధుకర్‌ అన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగానే ఆ కోళ్లు మృతి చెందినట్లు అందులో తేలిందన్నారు. మురుంబా గ్రామంలోని ఎనిమిది ఫౌల్ట్రీఫామ్‌లలో 8 వేల కోళ్లు ఉన్నాయని వెల్లడించారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో మిగిలిన కోళ్లన్నింటిని చంపేయాలని అధికారులను ఆదేశించారు.  

దేశంలో బర్డ్ ఫ్లూ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియానా, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లలో మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్టు ఇంకా రావాల్సివుంది.


logo