మహారాష్ట్రలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ.. వారాంతాల్లో లాక్డౌన్
లాక్డౌన్ | మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ( lockdown ) తరహా కఠిన ఆంక్షలు విధించింది.

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ (Lockdown ) తరహా కఠిన ఆంక్షలు విధించింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరిగింది. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం కఠిన ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలు విడుదల చేశారు. సోమవారం నుంచి రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానున్నది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.
వారాంతాల్లో పూర్తి లాక్డౌన్ను అమలు చేస్తారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. వారాంతరాల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు. పగటి పూట ఐదుగురు మించి గుమిగూడి ఉండకూడదు. థియేటర్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తారు. కేవలం టేక్అవే, ఫుడ్, నిత్యవసరాల డెలివరీని మాత్రమే అనుమతిస్తారు. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. సినిమా షూటింగ్లను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్ : బీహార్లో వారంపాటు విద్యాసంస్థల మూసివేత
కరోనా ఎఫెక్ట్ : జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు మరింత తగ్గుతాయి: ధర్మేంద్ర ప్రధాన్
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

