Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Scene | తమిళ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ థియేటర్లలోకి వచ్చేసింది. ‘ఆవేశం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తొలి రోజు వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. విమర్శకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్‌తో పాటు కొంతవరకు సామంచి రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సినిమా నెమ్మదిగా ప్రారంభమైంది.
Scene | తమిళ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ థియేటర్లలోకి వచ్చేసింది. ‘ఆవేశం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తొలి రోజు వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. విమర్శకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్‌తో పాటు కొంతవరకు సామంచి రివ్యూలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సినిమా నెమ్మదిగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ‘సీన్’ సినిమా తొలి రోజు సుమారు రూ.3.5 కోట్లగ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు, ప్రదర్శనలు దక్కలేదు. అదే సమయంలో ‘రామాయణ’ సినిమా పోటీ కూడా ‘సీన్’కు కొంత ఇబ్బందిగా మారింది. దీంతో థియేటర్లలో పరిమిత సంఖ్యలోనే ప్రదర్శనలు లభించాయి.
అయితే అందుబాటులో ఉన్న షోలలోనూ ప్రేక్షకుల ఆక్యుపెన్సీ ఆశాజనకంగా లేకపోవడం చిత్ర బృందానికి ఆందోళన కలిగించే అంశం. కేవలం షోల సంఖ్య తగ్గడం మాత్రమే కాకుండా, ప్రేక్షకుల నుంచి కూడా తొలి రోజు పెద్దగా స్పందన రాకపోవడంతో వసూళ్లు పరిమితంగానే నిలిచాయి. ‘సీన్’ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే బాక్సాఫీస్ వద్ద మరింత బలమైన ప్రదర్శన అవసరం. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా రూ.30 కోట్ల స్థూల వసూళ్లను సాధించాల్సి ఉంది. తొలి రోజు వచ్చిన వసూళ్లను చూస్తే ఈ లక్ష్యానికి చేరుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రెండో రోజు నుంచి వసూళ్లు భారీగా పెరిగితేనే సినిమా లక్ష్యానికి చేరువయ్యే అవకాశం ఉంటుంది.
వారాంతపు రోజుల్లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సినిమాకు వచ్చే మౌఖిక ప్రచారం, థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుదల బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. ఈ సినిమాలో నజ్రియా కథానాయికగా నటించగా, నస్లెన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. సూర్య, జీతూ మాధవన్‌తో పాటు ఝగరం స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశిన్ శ్యామ్ సంగీతాన్ని అందించారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సీన్’కు తొలి రోజు వసూళ్లు నిరాశ కలిగించాయి. ఇప్పుడు రెండో రోజు నుంచి సినిమా ఎంత మేర పుంజుకుంటుంది? ప్రేక్షకుల ఆదరణతో వసూళ్లలో పెరుగుదల కనిపిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

