ముంబై: మహారాష్ట్ర(Maharashtra)లోని రాయగడ్ జిల్లాలోని ఓ కాలువలో బస్సు పడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుణె నుంచి ముంబై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ముంబై-పుణె పాత హైవేపై ఉన్న శిన్‌గ్రోబా ఆలయం సమీపంలో ఉన్న లోయలో బస్సు పడింది.
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. గోరేగావ్‌లోని ఓ సంస్థకు చెందిన వ్యక్తులు అంతా పుణెకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
जुन्या पुणे-मुंबई महामार्गावर खासगी बस दरीत कोसळली,
12 ते 13 जणांचा मृत्यू
बसमध्ये 40 ते 45 लोक होते.
20 ते 25 लोक जखमी झाल्याची प्राथमिक
पुण्याहून मुंबईला ही बस निघाली होती#busaccident #raigad pic.twitter.com/LhdXdyTy9C
— Sayali Solkar (@sayali_solkar) April 15, 2023