Mahadev App | ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చిక్కుల్లోపడ్డారు. మహాదేవ్ యాప్ కేసులో రాయ్‌పూర్ ఆర్థిక నేరాల విభాగం బఘేల్‌తో పాటు పలువురి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 120బీ, 34, 406, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మార్చి 4న భూపేష్ బఘేల్, మరో 21 మందిపై కేసు నమోదు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలకు చిక్కుల్లో పడ్డారు. మాజీ సీఎంపై బఘేల్‌పై పోలీసు ఎఫ్ఐఆర్లో, మోసం, నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, ఫోర్జరీకి సంబంధించి ఐపీసీలో వివిధ సెక్షన్ల కింద అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11 కింద అభియోగాలు మోపారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సైతం మహాదేవ యాప్‌కు సంబంధించిన కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయ నాయకులతో పాటు అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలుండగా.. అక్రమ కార్యకలాపాల్లో మనీ లాండరింగ్ కోణంపై విచారణ జరుపుతున్నది. ఫిబ్రవరిలో ఈ కేసులో కేంద్ర ఏజెన్సీ తొమ్మిది మందిని అరెస్టు చేసింది. యాప్ ద్వారా వచ్చిన అక్రమ సొత్తును ఛత్తీస్‌గఢ్‌లోని రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు లంచాలు ఇచ్చేందుకు వినియోగించినట్లు ఏజెన్సీ గతంలో పేర్కొంది. ఈ యాప్ కేసులో బాలీవుడ్ నటులతో సహా పలువురు ప్రముఖలను విచారించారు. బెట్టింగ్, గేమింగ్ యాప్ ఇద్దరు ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌పై సహా ఇప్పటివరకు ఈడీ రెండు ఛార్జిషీట్లను దాఖలు చేసింది.