Maha Kumbh Mela | లక్నో: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్ రాజ్ సిద్ధమైంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో జరుగుతున్న ఈ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
ఈ ఆధ్యాత్మిక జాతరలో సుమారు 35 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. భక్తులకు సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎన్డీఆర్ఎఫ్ వాటర్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. 30 వేల మంది పోలీసులు నిరంతరం భక్తులకు భద్రత కల్పిస్తారు.