Earthquake | అఫ్గానిస్థాన్, మహారాష్ట్రలో స్వల్ప భూకంపం..
అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో (Fayzabad) భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.49 గంటలకు ఫైజాబాద్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 4.3గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో (Fayzabad) భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.49 గంటలకు ఫైజాబాద్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 4.3గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 215 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. ఫైజాబాద్‌కు 185 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. కాగా, అర్ధరాత్రి వేళ భూమి కంపించడంలో జనాలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. గత నెల 26న కూడా ఫైజాబాద్‌లో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Earthquake of Magnitude:4.3, Occurred on 15-07-2023, 00:49:39 IST, Lat: 35.52 & Long: 71.20, Depth: 215 Km ,Location: 185km SSE of Fayzabad, Afghanistan for more information Download the BhooKamp App https://t.co/r81yYtmhYV @Indiametdept @ndmaindia @KirenRijiju @Dr_Mishra1966 pic.twitter.com/d17WuoutWD
— National Center for Seismology (@NCS_Earthquake) July 14, 2023
కాగా, శనివారం ఉదయం 7.04 గంటలకు మహారాష్ట్రలోని (Maharashtra) హింగోళిలో (Hingoli) భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని ఎన్సీఎస్ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది.
Earthquake of Magnitude:3.6, Occurred on 15-07-2023, 07:04:45 IST, Lat: 19.38 & Long: 77.36, Depth: 10 Km ,Location: Hingoli, Maharashtra, India for more information Download the BhooKamp App https://t.co/Sy18TQS9Jg@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @KirenRijiju pic.twitter.com/UwjpjE7tzG
— National Center for Seismology (@NCS_Earthquake) July 15, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

