నిరాధార ఆరోపణలు తగదు
తమిళనాడు సీఎంను విమర్శించిన వ్యక్తిపై మద్రాస్ హైకోర్టు మండిపాటు
చెన్నై (గిండి), డిసెంబర్ 10: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అద్భుతంగా తన విధులు నిర్వహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ప్రశంసించింది. ఆయనను అకారణంగా విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించింది. మధురైకి చెందిన సాైట్టె మురుగన్ అనే వ్యక్తి కొద్దిరోజులు సీఎం స్టాలిన్‌పై పలురకాల ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఆయనపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టుచేశారు. మురుగన్ బెయిల్‌కోసం వేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన న్యాయమూర్తి పుగళేంది, ఏ ఆధారాలతో సీఎం స్టాలిన్‌పై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎంను అభినందించపోయినా పర్వాలేదని, ఆధారాలు లేకుండా విమర్శించటం సరికాదని స్పష్టంచేశారు. తమినాళనాడు ప్రభుత్వం చేసిన తప్పులేమిటో చెప్పాలని మురుగన్‌ను ఆదేశించారు. మురుగన్‌కు బెయిల్ మంజూరుచేసిన న్యాయమూర్తి.. నిరాధారంగా సీఎంపై ఇకముందు ఒక్కమాట మాట్లాడినా బెయిల్ రద్దుచేస్తామని హెచ్చరించారు.