Madhya Pradesh | బంగారు ఆభరణాల్ని యూట్యూబ్లో చూపించిన మహిళ.. దోచుకెళ్లిన దొంగలు
Madhya Pradesh : ఒక మహిళ తన యూట్యూబ్ ఛానెల్లో తనకున్న బంగారు ఆభరణాలను చూపించింది. వాటి గురించి వివరించింది. ఇంకేముంది.. ఆ వీడియో చూసిన దొంగలు ఆ నగలన్నింటినీ దోచుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
Madhya Pradesh : డిజిటల్ యుగంలో ప్రతివారు తమ లైఫ్స్టైల్ను పూర్తిగా బయటపెట్టుకుంటున్నారు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. తాజాగా ఒక మహిళ తన యూట్యూబ్ ఛానెల్లో తనకున్న బంగారు ఆభరణాలను చూపించింది. వాటి గురించి వివరించింది. ఇంకేముంది.. ఆ వీడియో చూసిన దొంగలు ఆ నగలన్నింటినీ దోచుకెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
ఇక్కడి శివపురి ప్రాంతంలోని మోహిని అనే గ్రామంలో రచనా గుర్జార్ అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమెకు యూట్యూబ్ ఛానెల్తోపాటు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కూడా ఉంది. ఈ రెండింటిలో ఆమె ఎప్పుడూ తనకున్న సంపద గురించి వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. తనకున్న నగలు, ఇతర ఖరీదైన వస్తువుల గురించి, ఇంటి గురించి వివరిస్తూ ఉంటుంది. ఇటీవల తన నగల్ని కూడా చూపించింది. ఈ వీడియోలు చూసిన దొంగలు రచనా గుర్జార్ ఇంటిని దోచుకోవాలని డిసైడయ్యారు. పక్కా ప్రణాళికతో ఇంట్లోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, పూర్తి మెటీరియల్స్తో వచ్చి ఇంట్లోకి ప్రవేశించారు. రచనా గుర్జార్ చూపించిన బంగారు, వెండి నగలు, డబ్బు దోచుకెళ్లారు. తర్వాత ఇది గమనించిన రచన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఏఎస్పీ సంజీవ్ మూల్ తెలిపారు. త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు. రచన సోషల్ మీడియా యాక్టివిటీ వల్లే దొంగలు ఆమె ఇంటిని టార్గెట్ చేశారని, అందువల్ల ఎవరైనా ఇలాంటివి పోస్ట్ చేసేముందు జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వాడకంపై సరైన అవగాహన, అప్రమత్తత అవసరం అని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

