Watch: కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తి.. కుక్క పిల్లను నేలకేసి కొట్టి కాలితో తొక్కి చంపాడు
Guna Man Smashes Puppy To Ground | ఒక వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. కుక్క పిల్లను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత కాలితో తొక్కి ఆ కుక్క పిల్లను చంపాడు. (Guna Man Smashes Puppy To Ground) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: ఒక వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. కుక్క పిల్లను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత కాలితో తొక్కి ఆ కుక్క పిల్లను చంపాడు. (Guna Man Smashes Puppy To Ground) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ దారుణం జరిగింది. శనివారం తెల్లవారుజామున మూసి ఉన్న షాపు ముందు ఒక వ్యక్తి కూర్చొన్నాడు. అతడి వద్దకు రెండు కుక్క పిల్లలు వచ్చాయి. అయితే ఆ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఒక కుక్క పిల్లను చేతితో ఎత్తి బలంగా రోడ్డు మీదకు విసిరేశాడు. ఆ తర్వాత లేచి అక్కడకు వెళ్లి కాలితో పలుమార్లు తొక్కి ఆ కుక్క పిల్లను దారుణంగా చంపాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. కుక్క పిల్లను క్రూరంగా చంపిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ పోస్ట్‌పై మధ్యప్రదేశ్ బీజేపీ ఐటీ సెల్ మాజీ ఇన్ఛార్జ్ శివరాజ్ సింగ్ దాబీ స్పందించారు. కుక్క పిల్లను కిరాతకంగా చంపిన ఆ వ్యక్తి వివరాలు వెల్లడించారు. ‘ఆ వ్యక్తి మనిషి కాదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు మృత్యుంజయ్, తండ్రి వినయ్ సింగ్. గుణ, జాదౌన్లోని రాధా కాలనీ నివాసి’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
https://twitter.com/TheViditsharma/status/1733553134939914740?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1733553134939914740%7Ctwgr%5E992588b6d63b89c5f1946cd1236877b5a53acb90%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fbhopal%2Fwatch-man-crushes-a-puppy-to-death-under-his-leg-horrific-visuals-surface
This man is not a human…
The accused has been taken into custody, his name is Mrityunjay, father, Vinay Singh, resident of Radha Colony, Guna, Jadoun.— Shivraj Singh Dabi (@ShivrajDabi) December 10, 2023
Deeply disturbed by the horrifying incident. Swift and strict action will be taken to ensure justice is served. We unequivocally condemn such acts of barbarism, and the individual responsible will face the consequences. https://t.co/yYdCyKli64
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

