Liquor Shop | భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లా నచంఖేదా గ్రామంలో ఓ మద్యం వ్యాపారి అతి తెలివిగా వ్యవహరించి అధికారులకు చిక్కాడు. “పగటి పూట ఇంగ్లిష్ నేర్చుకోండి” అని ఓ బ్యానర్‌ను అతని మద్యం దుకాణానికి కొంత దూరంలో పెట్టాడు. ఆ బ్యానర్లోని బాణం గుర్తు తన దుకాణాన్ని చూపిస్తున్నది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు దీనిని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఈ విషయం నెమ్మదిగా జిల్లా కలెక్టర్ భవ్య మిట్టల్‌కు చేరింది. దుకాణం యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను భవ్య ఆదేశించారు. వేరొకరి భూమిలో ఈ బ్యానర్‌ను ఎవరో కుట్రపూరితంగా పెట్టారని, తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ సమాధానంతో అధికారులు సంతృప్తి చెందలేదు. అతడికి రూ.10,000 జరిమానా విధించారు.