ఇండోర్ : చదువు మానేయాలని భార్యను భర్త బలవంతపెట్టడం క్రూరత్వమేనని మధ్య ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. అర్ధాంతరంగా చదువు మానేయాలని భార్యను బలవంతపెట్టడం, లేదా, చదువుకోవడాన్ని కొనసాగించలేని పరిస్థితిని సృష్టించడం ఆమె వైవాహిక జీవితం ప్రారంభంలోనే ఆమె కలలను నాశనం చేయడమేనని తెలిపింది. విద్యావంతుడు కానటువంటి లేదా తనను తాను మెరుగుపరచుకోవాలనే ఆసక్తి లేనటువంటి వ్యక్తితో కలిసి జీవించాలని ఆమెను నిర్బంధించడం కచ్చితంగా మానసిక క్రూరత్వం అవుతుందని చెప్పింది. విడాకులు మంజూరు చేయడానికి ఇది సరైన కారణమని స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.