భోపాల్ : కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే ఆయా రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను ప్రకటించుకున్నాయి. ఆ రాష్ర్టాల జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేరింది. కరోనా వైరస్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా మే 15వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. కరోనా పాజిటివిటీ రేటు 18 శాతం ఉన్నందునే లాక్డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అత్యవసర సర్వీసులు, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తేల్చిచెప్పారు.
To break the chain of transmission of corona in the state we have to completely shut everything till May 15, strict 'Janta Curfew'. We can't shut things for too long but with more than 18 % positivity we can't remain open: Madhya Pradesh CM Shivraj Singh Chouhan#COVID19 pic.twitter.com/eWuzBw3U0O
— ANI (@ANI) May 6, 2021