MP High Court | భోపాల్: సుదీర్ఘ కాలం సహ జీవనం చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్ద రూ చట్టబద్ధంగా పెండ్లి చేసుకోకపోయినప్పటి కీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హక్కు ఉంటుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. శనివారం ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ శైలేష్ బోప్చే (38), ప్రతివాది అనిత బోప్చే (48) చాలా కాలం నుంచి సహ జీవనం చేస్తున్నారు.
వీరిద్దరూ ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీ రిద్దరూ విడిపోయిన తర్వాత అనితకు నెలకు రూ.1,500 చొప్పున పోషణ భత్యం చెల్లించాలని శైలేష్‌ను ట్రయల్ కోర్టు ఆదేశించింది. దీ నిపై శైలేష్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చే శారు. విచారణ జరిపిన హైకోర్టు తీర్పు చెప్తూ, శైలేష్, అనిత భార్యాభర్తలుగానే చాలా కాలం జీవించారని, అనిత శైలేష్‌ను చట్టబద్ధంగా వి వాహం చేసుకున్నట్లు ట్రయల్ కోర్టు నిర్ధారించలేకపోయిందని, అయితే ఆమెకు పోషణ భ త్యం చెల్లించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు లో పొరపాటు లేదని స్పష్టం చేసింది.
తన భర్త వల్ల ఎటువంటి తప్పు లేకపోయినప్పటికీ, భర్త నుంచి వేరుగా ఉండటం కోసం భార్య ఇంటి నుంచి పదే పదే వెళ్లిపోవడం మా నసిక క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. పరస్పర సహకారం, విధేయత, విశ్వాసం, అంకిత భావంగల చక్కని వాతావరణంలో వివాహ బంధం వర్ధిల్లుతుందని, దూరంగా ఉండటం, వదిలిపెట్టడం వల్ల ఈ బంధం చక్కదిద్దడానికి వీల్లేని విధంగా దెబ్బతింటుందని అభిప్రాయపడింది.
ఓ కేసు లో భర్తకు భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది. ఆమె అతనిపట్ల మానసిక క్రూరత్వా న్ని ప్రదర్శించినట్లు నిర్ధారించింది. తన భార్య తనను దాదాపు ఏడు మార్లు విడిచిపెట్టిందని భర్త ఆరోపించారు. ఆమె మనసు స్థిరంగా ఉం డదని చెప్పారు. వీరిద్దరికీ విడాకులు మంజూ రు చేయడానికి తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది.