భోపాల్, మే 2: రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతుల కష్టాలను ఒక్క ఫోన్ కాల్‌తో తీర్చేస్తామంటూ మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన కార్యక్రమం ఆదిలోనే నవ్వుల పాలైంది. గత గురువారం ‘ఉచిత రైతు హెల్ప్‌లైన్’ నంబర్‌ను ప్రారంభిస్తూ, దీని పనితీరును తెలుసుకునేందుకు సీఎం మోహన్ యాదవ్ స్వయంగా ఫోన్ చేశారు.
తానొక సాధారణ రైతుగా చెప్పుకుంటూ..వేసవిలో ఏం పంట వేస్తే బాగుంటుందో చెప్పాలని టెలీ కాలర్‌ను అడిగారు. అయితే ‘ఈ సమయంలో ఎలాంటి సమాచారమూ ఇవ్వలేం’.. అంటూ హెల్ప్‌లైన్ నుంచి సమాధానం వచ్చింది. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఏ ఉద్దేశంతో హెల్ప్‌లైన్ తీసుకొచ్చామో..అది నెరవేరకపోవటంతో.. అందరూ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు.