తిరువనంతపురం : వీధి కుక్కల కేసు వల్ల తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు. ఈ కేసులో తనకు సహాయపడిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి ధన్యవాదాలు చెప్పారు. మానవులు-వన్య ప్రాణుల మధ్య ఘర్షణపై తిరువనంతపురంలో జరిగిన ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
న్యాయవాద వర్గాల్లో తన గురించి చాలా కాలం నుంచి తెలుసునని, అయితే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపునిచ్చినందుకు వీధి కుక్కలకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు.