చండీగఢ్, ఆగస్టు 29: వరద నష్టం అంచనా కోసం వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు పంజాబ్ మంత్రులు బాధితులు బాధలు, కష్టాలను గాలికొదిలేశారు. వరద బాధితుల సమస్యల ఊసే ఎత్తకుండా తాము జరిపిన విదేశీ పర్యటనలు, ఎక్కిన విదేశీ క్రూయిజ్‌లు, బీచ్ పర్యటనల గురించి ముచ్చట్లు పెట్టడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై వరద బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు.
టార్న్ టార్న్ జిల్లాలో సంభవించిన వరద నష్టం అంచనా కోసం తోటి మంత్రులు హర్భజన్ సింగ్, బరీందర్ కుమార్ గోయల్‌తో పడవలో వెళ్తున్న భుల్లర్ స్వీడన్, గోవాల్లో తన పర్యటనలఅనుభవాలను తన సహచరులతో పంచుకున్నారు.