Eclipses | ఖగోళ ప్రియులకు గుడ్‌న్యూస్. ఈ నెలలో రెండు గ్రహాణాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 18న చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. ఈ నెల 29న పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనున్నది. వాస్తవానికి ఈ ఏడాది రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. సూర్యగ్రహాలు, ఒక చంద్రగ్రహణం భారత్‌లో కనిపించేందుకు అవకాశం ఒక గ్రహణం మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉన్నది.
సూర్యుడి కాంతి భూమిని చేరకుండా చంద్రుడు పూర్తిగా కమ్మేసిన సందర్భంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ దృగ్విషయాన్ని సంపూర్ణ సూర్యగ్రహణంగా పేర్కొంటారు. సూర్యుడు, భూమికి మధ్య పాక్షికంగా చంద్రుడు అడ్డుగా వచ్చిన సందర్భంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా భూమి.. చంద్రుడిని పూర్తిగా కమ్మేస్తే సంపూర్ణ చంద్రగ్రహణంగా పేర్కొంటారు. చంద్రుడిలో కొంత భాగం మాత్రమే భూమి నీడలో కనిపించకుండాపోతే.. ఈ దృగ్విషయాన్ని పాక్షిక చంద్రగ్రహణంగా పేర్కొంటారు.
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఈ నెల 13-14తేదీల మధ్య సంభవించనున్నది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. అయితే, ఈ గ్రహణం మాత్రం భారత్‌లో కనిపించే అవకాశం లేదు. ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పు ఆసియా, అంటార్కిటికాలో మాత్రమే దర్శనం ఇస్తుంది.
ఇక ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఆవిష్కతం కానున్నది. ఈ గ్రహణం పాక్షిక గ్రహణం. ఈ గ్రహణం సైతం భారత్‌లో కనిపించే అవకాశం లేదు. బెర్ముడా, బార్బడోస్, డెన్మార్క్, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరి, ఐర్లాండ్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్‌తో పాటు పలు దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది.
ఇక ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7-8 తేదీల మధ్య కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత్‌తో పాటు యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర, పశ్చిమ అమెరికా, ఆఫ్రికా సహా పలు ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. రెండో సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న సంభవించనున్నది. ఈ గ్రహణం సైతం భారత్‌లో వీక్షించేందుకు అవకాశం లేదు. న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా, దక్షిణ ఆస్ట్రేలియా సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దర్శనం ఇస్తుంది.