లక్నో: ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక మహిళా నాయకురాలు రమా నిరజంన్ సహా మొత్తం నలుగురు ఎమ్మెల్సీలు ( Uttarpradesh MLCs ) అఖిలేష్ యాదవ్కు షాకిచ్చారు. ఆ నలుగురు ఎస్పీని నుంచి వైదొలిగి బీజేపీలో చేరారు. రమా నిరంజన్తోపాటు ఆమె భర్త కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
నలుగురు సమాజ్వాదీ ఎమ్మెల్సీలు.. యూపీ ఉపముఖ్యమంత్రులు దినేశ్ శర్మ, కేపీ మౌర్య, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. కాగా, ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.