న్యూఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి గ్యాస్ సిలిండర్ (LPG Cylinder Price) ధరలు తగ్గాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ రేట్లు కాదులేండి..! 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ ధరలు. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinders rates) ధరలను ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు రూ.72 మేర తగ్గించాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గడం ఇది మూడోసారి.
తాజా తగ్గింపుతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676గా ఉండగా, హైదరాబాద్లో రూ.1975.50గా ఉన్నది. ఇక కోల్కతాలో రూ.1787, ముంబైలో రూ.1629, చెన్నైలో రూ.1840.50కి చేరింది. పాట్నాలో రూ.1932, లక్నోలో రూ.1789, బెంగళూరులో రూ.1755గా ఉంది. కాగా, మే 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.19 మేర తగ్గిన విషయం తెలిసిందే.